Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

లండ‌న్ వీధుల్లో ధోని ఫ్యాన్ మేనియా!... వీడియో ఇదిగో!

ms dhoni spotted in london streets
  • ఇంగ్లండ్ టూర్‌లో కెప్టెన్ కూల్ ధోనీ
  • లండ‌న్‌లోని ఓ షాప్ నుంచి వ‌స్తుండ‌గా గుర్తుప‌ట్టిన ఫ్యాన్స్‌
  • భ‌ద్రతా సిబ్బంది మ‌ధ్య కారెక్కిన ఎంఎస్‌
  • సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారిన వీడియో
టీమిండియా మాజీ కెప్టెన్ మ‌హేంద్ర సింగ్ ధోనీ ఇంగ్లండ్ టూర్‌లో ఎంజాయ్ చేస్తున్నాడు. ఫ్యామిలీతో క‌లిసి చాలా రోజుల క్రిత‌మే ఇంగ్లండ్ టూర్ వెళ్లిన ధోని... అక్క‌డే త‌న బ‌ర్త్ డే వేడుక‌ల‌ను జ‌రుపుకున్నాడు. ఇక ప్ర‌స్తుతం ఇంగ్లండ్ టూర్‌లో ఉన్న టీమిండియా ఆడుతున్న మ్యాచ్‌ల‌ను వ‌రుస‌బెట్టి ప్ర‌త్య‌క్షంగా వీక్షిస్తున్నాడు. ఈ సంద‌ర్భంగా ప‌లువురు క్రికెట్ దిగ్గ‌జాల‌ను కూదా ధోనీ క‌లుస్తున్నాడు. 

తాజాగా లండ‌న్ వీధుల్లో క‌నిపించిన ధోనీ వీడియో ఒక‌టి సోష‌ల్ మీడియాలో హ‌ల్‌చ‌ల్ చేస్తోంది. లండ‌న్‌లోని ఓ షాప్‌లో నుంచి బ‌య‌ట‌కు వ‌స్తున్న ధోనీని గుర్తు ప‌ట్టిన అక్కడి క్రికెట్ అభిమానులు ఆత‌డిని చుట్టుముట్టారు. అయితే అప్ప‌టికే అప్ర‌మ‌త్త‌మైన భ‌ద్రతా సిబ్బంది ధోనీకి ర‌క్ష‌ణ‌గా నిలిచి అల్లంత దూరంలో నిలిపి ఉన్న వాహ‌నంలోకి ధోనీని ఎక్కించారు. ఈ సంద‌ర్భంగా ధోనీ ఫొటోలు, వీడియోలు తీసేందుకు అక్క‌డి జ‌నం ఎగ‌బ‌డ్డారు.
MS Dhoni
London
England

More Telugu News